
భక్తిశ్రద్ధలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
పూజలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు రూరల్: పెద్దేముల్ తండాలో జై శ్రీరామ్ స్మరణతో మార్మోగింది. ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ విగ్రహానికి పండితులు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన గావించారు. అంతకుముందు ఆలయ నిర్మాణ దాత పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ సర్పంచ్ తారాభాయి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఫైనాన్స్ కమిటీ మెంబర్ రమేష్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనిప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు అంజయ్య, గోపాల్, మురళీకృష్ణ గౌడ్, మల్లేశం, నారాయణరెడ్డి, మహిపాల్‌రెడ్డి, లొంక నర్సింలు, ఎల్లారెడ్డి, సంపత్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, రవి, డీవై నర్సింలు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన