రూ.కోటితో మేకల షెడ్డు | - | Sakshi
Sakshi News home page

రూ.కోటితో మేకల షెడ్డు

Aug 16 2025 9:01 AM | Updated on Aug 16 2025 9:01 AM

రూ.కో

రూ.కోటితో మేకల షెడ్డు

ఏఎంసీ డైరెక్టర్‌ యాదగిరి

బంట్వారం: మండల కేంద్రంలో మేకల షెడ్డు నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరైనట్లు మర్పల్లి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ యాదగిరి తెలిపారు. శుక్రవారం బంట్వారంలో సహచర డైరెక్టర్లు శాకం నర్సింలు ,ఇసాక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సహకారంతో చైర్మన్‌ మహేందరెడ్డి మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల మండల కేంద్రంలో ఎకరం ప్రభుత్వ భూమిలో మేకల సంతను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో మేకల షెడ్డు, ప్రహరీ, సీసీ రోడ్డు, బోరు వేయనున్నట్లు వివరించారు.

సీఎం పర్యటన వాయిదా

కొడంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ పర్యటన వాయిదా పడినట్లు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. ఈ నెల చివరి వారంలో సీఎం పర్యటన ఉండవచ్చన్నారు.

ధారూరు మండలప్రత్యేకాధికారిగా రాజేశ్వరి

ధారూరు: మండల ప్ర త్యేక అధికారిగా జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ ఆఫీ సర్‌ రాజేశ్వరిని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ నియమించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ఆర్డీఓగా పని చేస్తున్న రాజేశ్వరి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది వికారాబాద్‌ జిల్లాకు బదిలీపై వచ్చారు.

నేడు తాండూరుకు

మందకృష్ణ మాదిగ రాక

తాండూరు టౌన్‌: తాండూరు పట్టణంలో శనివారం నిర్వహించనున్న వికలాంగుల, చేయూత పెన్షన్‌ దారుల మహాగర్జన సభకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారని ఆ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్‌ మాదిగ తెలిపారు. స్థానిక గగరాణి ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 10గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. శుక్రవారం సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడారు. వికలాంగులకు రూ.6 వేలు, వృద్ధులకు, వితంతువులకు, చేయూత పెన్షన్‌ దారులకు రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

నేడు చించల్‌పేటకు

మంత్రులు

నవాబుపేట: మండలంలోని చించల్‌పేటకు శనివారం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రులు సీతక్క, అడ్లూరు లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య రానున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించి న అంగన్‌వాడీ భవనం, బీసీ కమ్యూనిటీ హా ల్‌, పశు వైద్యశాల భవనం, డ్వాక్రా భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ భవనం, జీపీ భవనాలను ప్రారంభిస్తారని ఎంపీడీఓ అనురాధ తెలిపారు.

1,500 గాంధీజీ

విగ్రహాల ప్రదర్శన

తుర్కయంజాల్‌: పురపాలక సంఘం పరిధి మన్నెగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని 1,500 మహాత్మా గాంధీ విగ్రహాలను ప్రదర్శించారు. గాంధీ గ్లోబల్‌ క్లబ్‌ ఫ్యామిలీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్‌ గున్నా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనతో విద్యార్థులకు గాంధీ గొప్పతనాన్ని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఒకే పాఠశాలలో 1,500 విగ్రహాలను ప్రదర్శించినందుకుగాను వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుందని ఇంటర్నేషనల్‌ చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ బింగి నరేందర్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు స్కూల్‌ ఎండీ చింతల సంగమేశ్వర గుప్తాకు మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రూ.కోటితో మేకల షెడ్డు 
1
1/2

రూ.కోటితో మేకల షెడ్డు

రూ.కోటితో మేకల షెడ్డు 
2
2/2

రూ.కోటితో మేకల షెడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement