
బీసీ రిజర్వేషన్లకు ఆమోద ముద్ర
తాండూరు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో శాసన సభలో ఆమోద ముద్ర వేశామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ తండాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ఉద్యమిస్తోందన్నారు. వికారాబాద్‌లో మూడు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకు రాష్ట్ర వాటా 25 శాతం, కేంద్రం వాటా 75 శాతం ఉంటుందని వివరించారు. మూడేళ్ల కాలంలో ఈ పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్య దర్శి థారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, మురళీకృష్ణాగౌడ్, నారాయణరెడ్డి, శోభారా ణి, పట్లోళ్ల బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.