
అభివృద్ధి పనుల పరిశీలన
నవాబుపేట: మండలంలోని వట్టిమీనపల్లిలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనును బుధవారం అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి పరిశీలించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు, పశువుల పాకల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ విజయ్ కుమార్, ఏపీవో లక్ష్మీదేవి, ఈసీ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు గీత, నితిన్, టీఏ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులు
ఎంఈఓ వెంకటయ్య
తాండూరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ పేరిట ఈ నెల 11న ప్రభుత్వం సంబంధిత అధికారులకు ప్రొసీడింగ్‌లు పంపించింది. ఈ విభాగంలో విద్యార్థులకు 20శాతం మార్కులను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో జిల్లాలో టెన్త్ చదువుతున్న సుమారు 13 వేల మంది విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు వేయనున్నట్లు తాండూరు ఎంఈఓ వెంకటయ్య తెలిపారు. గతంలో మాదిరిగానే అంతర్గత మూల్యాంకణం మార్కులు ఉంటాయని వెల్లడించారు.