దోమకాటు.. ఆరోగ్యానికి చేటు | - | Sakshi
Sakshi News home page

దోమకాటు.. ఆరోగ్యానికి చేటు

Aug 13 2025 7:40 AM | Updated on Aug 13 2025 7:40 AM

దోమకా

దోమకాటు.. ఆరోగ్యానికి చేటు

దుద్యాల్‌: ఇటీవల దంచి కొడుతున్న వర్షాలకు గ్రామాలు, పట్టణాల్లోని వీధులు బురదమయంగా తయారయ్యాయి. దీంతో దుర్గంధం ప్రబలి చిత్తడి వాతావరణంలో దోమలు వృద్ధి చెందే ఆస్కారం ఉంది. సీజనల్‌ వ్యాధులు కలవరపెడుతున్న తరుణంలో దోమకాటు సామాన్యులకు శరాఘాతంగా మారుతుంది. అపరిశుభ్ర వాతావరణం, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలే దోమలకు ఆవాసాలు. వీటి కాటుకు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జిల్లాలో డెంగీతో మృతిచెందిన సంఘటనలున్నాయి. దోమకాటుతో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలను వైద్యాధికారులు వివరించారు.

వ్యాధుల తీరు ఇలా..

మలేరియా: ఆడ అనాఫిలిస్‌ దోమ కుట్టడంతో మలేరియా వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగిని దోమ కుట్టడంతో దాని కడుపులోకి పరాన్నజీవి ప్రవేశించి అక్కడే పెరుగుతుంది. ఇదే దోమ మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఆ వ్యక్తి రక్తంలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది.

లక్షణాలు: చలి వణుకుతో కూడిన జ్వరం రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, జ్వరం విడిచి విడిచి వస్తుంటుంది.

డెంగీ: పగటి సమయంలో కుట్టే ఏడీస్‌ ఆడ దోమల ద్వారా డెంగీ వ్యాధి సోకుతుంది. ఇది సాధారణ వైరస్‌ ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో జ్వరం మొదలవుతుంది.

లక్షణాలు: హఠాత్తుగా తీవ్ర జ్వరం రావడం, కదలలేని స్థితి, ఎముకలు, కండారాలలో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు, వాంతులు, వికారం, నోరు ఎండిపోవడంతో పాటు చిగుళ్లు, ముక్కు ద్వారా రక్తం వస్తుంది.

చికున్‌గున్యా: ఏడిస్‌ ఈజిప్‌లై దోమలతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చేతులు, కాళ్లు, కీళ్లలో వాపు వచ్చి కనీసం అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది. జ్వరంతో మనిషి బలహీనంగా ఉంటాడు.

లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారంతో పాటు హఠాత్తుగా జ్వరం, కీళ్ల నొప్పులు, సరిగా నిలబడలేకపోవడం వంటివి.

పైలేరియా: దీనిని బోదకాలు అని కూడా అంటారు. క్యూలెక్స్‌ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శరీరంలోని ఏ భాగానికై నా బోదకాలు సోకుతుంది.

లక్షణాలు: తరచూ జ్వరం, చంకలు, కాళ్ల భాగంలో బిళ్లలు కట్టడం, వెన్నుముక దగ్గర నుంచి అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వంటి ప్రాణాంతకరమైన వ్యాధులను నివారించాలంటే వైద్యం ఇంటి నుంచే ప్రారంభం కావాలంటున్నారు పెద ్దలు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే తప్పా దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి వారు ఇంటి లోపల దోమలు లేకుండా చూసుకోవడం మంచిది. దోమ తెరను ఉపయోగించాలి. వేపనూనె, కొబ్బరినూనె, నిమ్మరసం మిశ్రమాన్ని చర్మంపై రాసుకోవడం ద్వారా దోమల నుంచి విముక్తి పొందవచ్చు. ఇంట్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. టీ, కాఫీ పౌడర్‌ను నిల్వ నీటిలో చల్లినట్‌లైతే దోమల గుడ్లు నిర్వీర్యమవుతాయి.

నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు

వర్షాలతో దోమల వ్యాప్తికి ఆస్కారం

పరిసరాలను పరిశుభ్రంగా

ఉంచుకోవాలని నిపుణుల సూచన

నిర్లక్ష్యం చేయొద్దు

వర్షాలకు చల్లటి గాలి వీచడంతో విష జ్వరాలు సోకే అవకాశాలున్నాయి. చిన్న, పెద్దలు అనే తేడా లేకుండా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. సాధారణ జ్వరం ఉన్న చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

– డాక్టర్‌ వందనరాజన్‌, హకీంపేట్‌

దోమకాటు.. ఆరోగ్యానికి చేటు 1
1/2

దోమకాటు.. ఆరోగ్యానికి చేటు

దోమకాటు.. ఆరోగ్యానికి చేటు 2
2/2

దోమకాటు.. ఆరోగ్యానికి చేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement