
రైతులకు ఇబ్బందులు రానీయొద్దు
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: విద్యుత్ ఽఅధికారులు ఎప్పుడూ ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సమస్యలు గ్రామాల్లో చాలా ఉన్నాయని వాటిని తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను అందజేస్తుందని తెలిపారు. విద్యుత్ అధికారులు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.