
కోట్‌పల్లి పీహెచ్‌సీ పరిశీలన
బంట్వారం: వారానికోసారి నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఎంసీహెచ్ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ పవిత్ర అన్నారు. మంగళవారం కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. 15 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు తప్పనిసరిగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలన్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు సంబంధించిన వైద్య సేవలపై మెడికల్ ఆఫీసర్ మేఘనను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ఆఫీసర్ నిరోష, డాక్టర్లు మేఘన, బీబీజానీ ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.