
ఆలయాలను కూల్చడం ప్రభుత్వానికి సిగ్గుచేటు
దోమ: హిందూ దేవాలయాలను కూల్చడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా కార్యదర్శి మేకల యాదయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘పెద్దతల్లికి కుంకుమార్చన’ కార్యక్రమానికి తరలివెళ్తున్న పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు తీరు మారకపోతే రానున్న రోజుల్లో ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు.
బీజేపీ నేతల ముందస్తు అరెస్టు
అనంతగిరి: బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న వీహెచ్‌పీ, బీజేపీ నాయకులను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌కుమార్, బీజేపీ జిల్లా అద్యక్షుడు రాజఽశేఖర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, నాయకులు శ్రీనివాస్, ఆచారి, మోహన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
నేలకూలిన వందేళ్ల మర్రి చెట్టు
పరిగి: దాదాపు 110 ఏళ్ల చరిత్ర గల మర్రి చెట్టు నేలకూలింది. పట్టణ కేంద్రంలోని కొడంగల్ చౌరస్తాలో బాలు టిఫిన్ సెంటర్ ముందు ఉన్న మర్రి చెట్టు చరిత్ర వంద ఏళ్ల పైమాటే. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మర్రి చెట్టు వేర్లు మెత్తబడి ఒక్కసారిగా నేలకు ఒరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు మెల్ల మెల్లగా వృక్షం ఒరగడంతో టిఫిన్ సెంటర్ యజమాని గమనించి చుట్టు పక్కల వారికి సమాచారం అందించారు. చెట్టు ఒక్కసారిగా టిఫిన్ సెంటర్‌పై పడటంతో రేకులు మొత్తం దెబ్బతిన్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వంద ఏళ్లకు పైగా వయసున్న మర్రి చెట్టు నేలకూలడంతో చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.
అభివృద్ధికి నిధులివ్వండి
దుద్యాల్: గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మండలంలోని కుదురుమల్ల గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామం అన్ని రంగాల్లో వెనుకబడిందని, నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు నర్సింహారెడ్డి, యాదగిరి రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రతిష్ఠ
రెండో రోజూ పూజలు
బొంరాస్‌పేట: మండల కేంద్రంలోని అభయాంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ఠ రెండు రోజులుగా జరుగుతున్నాయి. మంగళవారం అభయాంజనేయస్వామి ఆలయం వద్ద జ్యోషి సత్యనారాయణశర్మ పండిత బృందంచే పంచ నాభిశిలలు, ధ్వజస్తంభానికి జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం నిర్వహించారు. ఉదయం గోపూజ, ముఖ్యదేవత, దుర్గామాత, నవగ్రహ హోమాలు, ఆంజనేయస్వామికి సిందూరాభిషేకం, అలంకరణ చేపట్టారు. కృష్ణయ్య నాదస్వరం బృందంచే సన్నాయిమేళం, తీర్థప్రసాదాలు, సాయంత్రం భజన నిర్వహించారు.
నేడు ప్రతిష్ఠ..
మూడో రోజు బుధవారం గ్రామంలోని ఐదు స్థలాల్లో బొడ్రాయి ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాలు పండుగలా నిర్వహించనున్నట్లు పండితులు శ్రీనివాసరావు, సుదీంద్ర, సునీ ల్, శ్రీకాంత్, భరద్వాజ్, సంపత్‌లు తెలిపారు.

ఆలయాలను కూల్చడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

ఆలయాలను కూల్చడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

ఆలయాలను కూల్చడం ప్రభుత్వానికి సిగ్గుచేటు