
దేవాలయాలకు రక్షణ కల్పించాలి
కేశంపేట: రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పసుల నర్సింహయాదవ్ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద పాక్షికంగా గోడను ధ్వంసం చేయడంతో బీజేపీ పిలుపు మేరకు చలో పెద్దమ్మతల్లి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంకుమార్చన నిర్వహించేందుకు పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. దీంతో కేశంపేట పోలీసులు మండలంలో పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి.. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన చలో పెద్దమ్మతల్లి కార్యక్రమాన్ని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో హిందువులకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల మండల కన్వీనర్ కంచుకోట మహేశ్, సంస్కృతిక శాఖ జిల్లా కో–కన్వీనర్ కర్రెడ్ల నరేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, యాదయ్య, కోటి చేశారు.
బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహయాదవ్