
పనితీరు మార్చుకోండి
తాండూరు రూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని ఎంఈఓ వెంకటయ్య ఆదేశించారు. ‘తాళం వేయబడి’ శీర్షికతో మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. సోమవారం తెరుచుకోని గుంతబాస్పల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలకు సోమవారం లోకల్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని హెచ్‌ఎం జగన్నాథం, టీచర్ సంగీతను ప్రశ్నించారు. తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ.. సమయ పాలన పాటిస్తూ, విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని సూచించారు. ఇప్పటికే మెమోలు తీసుకున్న నేపథ్యంలో విధుల్లో మరోసారి అలసత్వం ప్రదర్శిస్తే కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ అంగీకారం మేరకే సోమవారం స్కూల్‌కు సెలవు ప్రకటించారని విద్యార్థుల తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ కార్యక్ర మంలో మాజీ సర్పంచ్ జగదీశ్, అజ్గర్, దస్తయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు
ఎంఈఓ హెచ్చరిక
గుంతబాస్పల్లి ప్రాథమిక పాఠశాలలో విచారణ

పనితీరు మార్చుకోండి