
తొలగింపా?
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పొడిగింపా..
తాండూరు: పీఏసీఎస్ పాలక వర్గాల పదవీకాలం ఈ నెల 14తో ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతోనే వారి గడువు ముగియగా ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున రైతు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సారైనా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా లేకుంటే గడువు పొడి గిస్తుందా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉండగా సహకార ఎన్నికల విషయంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తేవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో(వికారాబాద్, రంగారెడ్డి, మెడ్చల్) మొత్తం 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి 2019లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వికారాబాద్ జిల్లాలో అత్యధిక సంఘాలను బీఆర్‌ఎస్ పార్టీ కై వసం చేసుకొని పాలక వర్గాలను ఏర్పాటు చేసింది. నాడు డీసీసీబీ పాలక వర్గాన్ని, పీఏసీఎస్ చైర్మన్లను కలిసి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బుయ్యని మనోహర్‌రెడ్డి(ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే) డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనోహర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాఽధించారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్‌గా సత్తయ్య, వైస్ చైర్మన్‌గా రవిగౌడ్ కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం రెండు రోజుల్లో ముగియనుంది.
న్యూస్‌రీల్
మరో అవకాశం ఇవ్వాలి
వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం పొడిగింపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో దఫా పొడిగించాలని తాము కోరుతున్నాం. మరో రెండు రోజుల వ్యవధిలో పదవీకాలం ముగుస్తుంది. సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం.
– రవిగౌడ్, వైస్ చైర్మన్, డీసీసీబీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
ఈ నెల14తో ముగియనున్న పీఏసీఎస్ పాలక వర్గాల పదవీ కాలం
ఇప్పటికే ఆరునెలల పొడిగింపు

తొలగింపా?

తొలగింపా?