
అప్రమత్తంగా ఉండండి
అనంతగిరి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చూడాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు, వంతెనల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. లీకేజీ అవుతున్న గురుకుల, పాఠశాల భవనాలకు తక్షణం మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. పాతబడిన భవనాలు, ఇళ్లను గుర్తించి వాటిలో ప్రజలు ఉండకుండా చూడాలన్నారు. మురుగు నీరు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడటంతోపాటు వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్‌డీఓ వాసుచంద్ర, డీఆర్‌డీఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
జిల్లా ప్రత్యేక అధికారి,సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్

అప్రమత్తంగా ఉండండి