
సీఎంఆర్ అందజేయాలి
అనంతగిరి: రబీ సీజన్ 2024–25కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను మిల్లర్లు తక్షణం పూర్తిగా అందజేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. అలాగే ఖరీఫ్, రబీ 2025 – 26 సీజన్ల బియ్యం డెలివరీని వేగవంతం చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లర్లు వారివారి మిల్లుల సామర్థ్యం మేరకు సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐకి అందజేయాలన్నారు. అధికారులు మిల్లుల నుంచి వచ్చే బియ్యం నిల్వకు గోదాంలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే తగినంత మంది హమాలీలు నియమించుకోవాలన్నారు. సమావేశంలో డీఎంసీఎస్ మోహన్ కృష్ణ, డీఎస్‌ఓ సుదర్శన్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
క్లస్టర్ల వారీగా వివరాలు సేకరించాలి
త్వరలో జిల్లాకు గ్రామ పాలన అధికారులు(జీపీఓ) రానున్నందున క్లస్టర్ల వారీగా ఎంత మంది అవసరం అనే వివరాలు సేకరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు గ్రామ పాలన అధికారులు వస్తున్నందున వారిని ఏయే ప్రాంతాల్లో నియమించాలి అనే దానిపై ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్