
అనుమతులు ఇవ్వొద్దు
యాలాల: మండలంలోని కాకరవేణి నది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పనులకు ఇసుక అనుమతులు ఇవ్వరాదంటూ యాలాల, విశ్వనాథ్‌పూర్, గోవిందరావుపేటకు చెందిన రైతులు కోరారు. సోమవారం వికారాబాద్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాకరవేణి నది నుంచి ఇసుక అనుమతుల కారణంగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. నది పరీవాహక ప్రాంతంలో బోరుబావులు అడుగంటిపోతున్నాయని వాపోయారు. ఇసుక అనుమతుల కారణంగా శివసాగర్ ప్రాజెక్టు కరకట్ట, చెక్‌డ్యాంలకు నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్, సొసై టీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, రైతులు మాధవరెడ్డి, నాగప్ప, అశోక్, భాస్కరచారి, చెన్‌వీ రప్ప, గోపాల్, బసప్ప, బషీర్ తదితరులు ఉన్నారు.
16న పరిగికి మందకృష్ణ మాదిగ రాక
పరిగి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 16న పరిగి పట్టణానికి రానున్నట్లు ఆ సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుభాష్ మాదిగ తెలిపారు. సోమవారం పరిగి పట్టణంలోని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ మొత్తం పెంచాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్ మాదిగ, ప్రశాంత్, వెంకటేష్, పుష్పరాణి, సునీత తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఏజెంట్‌గా
ఎన్నికల కమిషన్
● దొంగ ఓట్లతోనే కేంద్రంలో అధికారం
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి ఏజెంట్‌లా పనిచేస్తోందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం పరిగి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్ అందరికీ సమానమైన ఓటు హక్కు కల్పిస్తే దాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. దేశంలో ఎన్నో స్థానాలను కాంగ్రెస్ తక్కువ ఓట్లతోనే ఓడిపోయిందన్నారు. అందుకు కారణం ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమే అన్నారు. దొంగ ఓట్ల భాగోతాన్ని రాహుల్ గాంధీ బయట పెడితే నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఒకే ఇంటి నంబర్‌పై 80 మంది ఓటర్లను ఎలా నమోదు చేసుకుంటారు అని నిలదీశారు. ప్రజాస్వామ్యా న్ని బీజేపీ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తుంటే కేంద్రం అడ్డుపడుతోందని విమర్శించారు.
విద్యావ్యవస్థ పటిష్టానికి కృషి
రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్
డాక్టర్ చారకొండ వెంకటేశ్
మాడ్గుల: విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. సోమవారం ఆయన మాడ్గుల జెడ్పీహెచ్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ ఫౌండేషన్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి సర్కార్ బడులను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దూరప్రాంత విద్యార్థులకు స్కూల్ బస్‌లు ఏర్పాటు చేస్తామన్నా రు. త్వరలో 317 జీఓ రద్దు చేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

అనుమతులు ఇవ్వొద్దు

అనుమతులు ఇవ్వొద్దు