
తాండూరు ఆస్పత్రికి మిషన్లు
● ఆరోగ్యశ్రీ రాష్ట్ర జీఎం డాక్టర్ రాంబాబు
తాండూరు టౌన్: తాండూరు జిల్లా ఆస్పత్రి లోని డయాలసిస్ సెంటర్‌కు (రక్త మార్పిడి) కొత్తగా ఐదు మిషన్లు అందుబాటులోకి తెచ్చి నట్లు ఆరోగ్య శ్రీ రాష్ట్ర జనరల్ మేనేజర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. సోమవారం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఉమ్మ డి రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ సతీష్ రెడ్డిలతో కలిసి మిషన్ల ఏర్పాటు కోసం వసతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ నిర్వహించేందుకు జిల్లా ఆస్పత్రిలో ఎనిమిది మిషన్లు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా సుమారు 60 మంది పేషెంట్లకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. అయితే మరో 30 మందికి పైగా పేషెంట్లు వేచి చూడాల్సి వస్తోందన్నారు. దీంతో నూతనంగా ఐదు మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. త్వరలో వీటని ప్రారంభిస్తామన్నా రు. డయాలసిస్ సేవల కోసం 94929 13384 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డయాలసిస్ మేనేజర్ కిషన్ కిషోర్, జిల్లా ఇన్‌చార్జ్ టీం లీడర్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.