
యువకుడి అనుమానాస్పద మృతి
మోమిన్‌పేట: మండలంలోని వెల్‌చాల్ గ్రామ శివారులో గల రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడి మృత దేహం లభ్యమైంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వెల్‌చాల్ గ్రామానికి చెందిన మన్నే సాయికుమార్ (22) గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ వద్ద విగతజీవిగా కనిపించాడు. మధ్యాహ్నం రైల్వే ఉద్యోగులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమారుడు సాయికుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తండ్రి మల్లేశం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి రైల్వే ట్రాక్ వద్ద పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.