
కరెంటోళ్లకు దండాలు
కేశంపేట: ప్రజలకు వెలుగులు పంచే క్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వేములనర్వ గ్రామ పరిధిలోని చౌదరిగూడ ఫీడర్‌కు కరెంట్ సరఫరా చేసే స్తంభంపై ఆదివారం రాత్రి అంతరాయం ఏర్పడింది. ఏఈ ఈశ్వర్, లైన్ ఇన్‌స్పెక్టర్ రాజు, అసిస్టెంట్ లైన్‌మెన్ శ్రీకాంత్ సోమవారం ఉదయం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇప్పలపల్లి చెరువులోని స్తంభంపై ఇన్సులేటర్ కాలిపోయినట్లు అసిస్టెంట్ లైన్‌మెన్ శ్రీకాంత్ గుర్తించాడు. స్థానిక రైతు శ్రీనివాస్‌రెడ్డి సాయంతో నీట మునిగిన స్తంభంపైకి ఎక్కి ఇన్సులేటర్ బిగించి సమస్యను పరిష్కరించారు. ఇది చూసిన స్థానిక ప్రజలు, రైతులు కరెంటోళ్లకు దండాలు అంటూ ధన్యవాదములు తెలియజేశారు.

కరెంటోళ్లకు దండాలు