
నేరాల నియంత్రణ మన బాధ్యత
పరిగి: నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు కృషి చేయాలని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పరిగి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కేసులు తగ్గించేందుకు శ్రమించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. యువత తప్పుదోవ పట్టించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలన్నారు. దొంగతనాల కేసుల పట్ల ప్రత్యేక చొరవ చూపి వాటిని త్వరగా ఛేదించాలని తెలిపారు. ప్రజలకు సీసీ కెమెరాల ఆవస్యకతను వివరించాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ మోహన్ కృష్ణ, ఆయ పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు పాల్గొన్నారు.
క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలి
ఎస్పీ నారాయణరెడ్డి