
గంట్లవెళ్లి ఎంపీపీఎస్‌లో ఫ్యాన్లు ధ్వంసం
షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని గంట్లవెళ్లి ప్రాథమికోన్నత పాఠశాల(ఎంపీపీఎస్)లో సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాల హెచ్‌ఎం శ్రీధర్‌రెడ్డి దాతల సహకారంతో విద్యార్థుల సౌకర్యార్థం తరగతి గదుల్లో, వరండాలో సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయించారు. వరుస సెలవులు ఉండడంతో వరండాలోని ఫ్యాన్లను దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు పాఠశాల మైదానంలో ఆడుకునేందుకు వస్తుంటారని.. వారిలో ఎవరైనా ఈ పని చేసి ఉంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి తదిపరి చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎం శ్రీధర్‌రెడ్డి తెలిపారు.