
కోట్‌పల్లి ప్రాజెక్టుకు చేరుతున్న వరద
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టులో వాగుల ద్వారా ఆదివారం వరకు 16 అడుగుల మేర వరదనీరు చేరింది. 3 సంవత్సరాల నుంచి జూలై నెలలోనే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయేది. అక్కడి నుంచి అలుగు ద్వారా కాగ్నా నుంచి ప్రవహించి కృష్ణానదిలో చేరేది. కానీ ఈ సారి వర్షాలు సంవృద్ధిగా కురియకపోవడంతో ఎగువ ప్రాంతాలనుంచి వరద ప్రవాహం తగ్గింది. జూలైలో కేవలం 4 అడుగుల నీరు చేరడంతో 14.6 అడుగుల వరకు నీటి నిల్వకు చేరింది. మరో 8 అడుగుల నీరు చేరితేనే ప్రాజెక్టు పూర్తిగా నిండుంతుందని అధికారులు చెబుతున్నారు. రబీ పంటలకు నీరు అందాలంటే ప్రాజెక్టు పూర్తిగా నిండాలని రైతులు చెబుతున్నారు.
16 అడుగులకు చేరిన నీటిమట్టం