
ఘనంగా లక్ష బిల్వార్చన
అనంతగిరి: వికారాబాద్ పట్టణానికి సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచే ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సామూహిక లక్ష్య బిల్వార్చన చేసి తీర్థ ప్రసాదాలు అందుకుని మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. పలువురు ప్రముఖులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.