
గ్రామాభివృద్ధికి కృషి
స్పీకర్ ప్రసాద్‌కుమార్
తాండూరు రూరల్: తాను పుట్టి పెరిగిన ఊరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని బెల్కటూర్‌లో స్పీకర్ తన వ్యవసాయ క్షేత్రంలో పునర్నిర్మించిన మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన బెల్కటూర్‌తో పాటు గ్రామస్తులను గుర్తు చేశారు. బెల్కటూర్–కరన్‌కోట్ మార్గంలో బ్రిడ్జి నిర్మాణ పనులు నెల రోజుల్లో పూర్తి అవుతాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు మదన్‌మోహన్, నారాయణరెడ్డి, వెంకటేష్, అశోక్, యువకులు పాల్గొన్నారు. అంతకుముందు పురోహితులు స్పీకర్‌కు పూర్ణహుతితో స్వాగతం పలికారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణరెడ్డి, రూరల్ సీఐ నగేష్, పట్టణ సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.