16 మేకల అపహరణ | - | Sakshi
Sakshi News home page

16 మేకల అపహరణ

Aug 9 2025 8:42 AM | Updated on Aug 9 2025 8:42 AM

16 మే

16 మేకల అపహరణ

దోమ: గుర్తు తెలియని దుండగలో కొట్టంలో ఉన్న మేకలను అపహరించుకుపోయారు. ఈ ఘటన దోమ ఠాణా పరిధిలోని ఉదన్‌రావుపల్లిలో శుక్రవారం వెలుగుజూసింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నీరటి సాయిలు మేకలు సాకుతూ జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం జీవాలను మేపిన తర్వాత సాయంత్రం పాకలో ఉంచి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం వచ్చి చూడగా 16 మేకలు అపహరణకు గురయ్యాయి. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

కొండముచ్చుకు

అంత్యక్రియలు

బషీరాబాద్‌: చెట్టుమీద నుంచి కిందపడి మృతి చెందిన కొండముచ్చుకు శుక్రవారం పర్వత్‌పల్లిలో యువకులు అంత్యక్రియలు చేశారు. గ్రామంలోని హనుమాన్‌ ఆలయం దగ్గర చెట్టుమీద నుంచి మరో చెట్టుమీదకు దూకుతున్న క్రమంలో కిందపడి అక్కడికక్కడే మృత్యువాత పడింది. గమనించిన యువకులు కొత్త వస్త్రాలు కట్టించి డప్పు చప్పులతో ఊరేగింపు చేసి గ్రామ శివారులో ఖననం చేశారు.

ప్రమాదకరంగా

విద్యుత్‌ తీగలు

పరిగి: విద్యుత్‌ తీగలు ప్రమాదకరంగా మారి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మండల పరిధిలోని రంగంపల్లిలో నర్సింహులు రైతు పొలంలో మీదుగా 11 కేవీ విద్యుత్‌ తీగలు చేతికి అందే ఎత్తులో ఉన్నాయి. వానాకాలం సీజన్‌ సాగులో ట్రాక్టర్‌ పనుల్లో వాహనాలకు తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. తీగలను సరి చేయాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి

నందిగామ: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అంతిరెడ్డిగూడ పంచాయతీ పృథ్వీకాలనీలో శుక్రవారం హనుమాన్‌ ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుమాన్‌ ఆలయ ఆవరణలో మార్క కుమార్‌ యాదవ్‌ ఆర్థిక సహాయంతో నూతనంగా నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీవైస్‌ చైర్మన్‌ గణేష్‌, మాజీ సర్పంచ్‌ వెంకట్‌ రెడ్డి, కొత్తూరు మాజీ ఎంపీపీ మదుసూధన్‌ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ నారాయణ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, మాజీ చైర్మన్‌ విఠల్‌, మాజీ సర్పంచులు అశోక్‌, కుమార్‌, మాజీ ఉప సర్పంచ్‌ కుమార్‌, కౌన్సిలర్‌ కోస్గి శ్రీనివాస్‌, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు తుమ్మల నర్సింహయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ ఢీ..

ద్విచక్ర వాహనదారుడు మృతి

మాడ్గుల: ట్రాక్టర్‌ ఢీకొట్టి ఓ ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని చౌటకుంట తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్‌రావు తెలిపిన ప్రకారం.. నర్సంపల్లికి చెందిన పోలే మొగులయ్య(45) తన భార్య, కుమారుడితో కలిసి ఇర్విన్‌లో ఉన్న బ్యాంకుకు బయలు దేరాడు. మార్గమధ్యలో చౌటకుంట తండా సమీపంలో బైక్‌ ముందుకు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌కు ఎదురుగా ఓ ట్రాక్టర్‌ రావడంతో సైడ్‌ ఇచ్చేందుకు వెనకాల ఉన్న బైక్‌ను గమనించకుండా వాహనాన్ని రివర్స్‌ తీశాడు. దీంతో ద్విచక్రవాహనదారుడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య, కుమారుడికి స్వల్పగాయాలయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఉత్సవాలకు ఆహ్వానం

తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ వార్షిక వేడుకలు ఈనెల 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు రావాలంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డితో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ రెడ్డిగళ్ల రత్నం, నాయకులు జెల్లాల లక్ష్మయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

16 మేకల అపహరణ 1
1/1

16 మేకల అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement