
కేజీబీవీ వద్ద పడిగాపులు
దోమ: రాఖీ పౌర్ణమి నేపథ్యంలో విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్లేందుకు కేజీబీవీకి వచ్చిన తల్లిదండ్రులకు అసహనానికి లోనయ్యారు. వివరాలు.. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లేందుకు ఉదయం 9గంటలకే సుమారు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. కాగా పాఠశాల విద్యార్థులు గేట్ ఓపెన్ చేయలేదు. మధ్యాహ్నం తర్వాత పంపిస్తామని చెప్పారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చిన వెంటనే పంపించడంతో మిగిలిన వారు ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. ఉపాధ్యాయుల పరిచయస్తులుంటే వెంటనే పంపించారని మండిపడ్డారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ పైరవీలతోనే పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎంఈఓ వెంకట్, పాఠశాల ఎస్‌ఓ శైలజను వివరణ కొరగా.. అనారోగ్యంతో ఇబ్బంది పడేవరానికి, దూర భారం ఉన్నవారిని పంపించామని.. మిగిలిన వారిని మధ్యాహ్న భోజనం తర్వాత పంపిస్తామని చెప్పామన్నారు.
విద్యార్థులను పంపకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన