అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయండి
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలోని చిలకవాగు, గొల్ల చెరువు ప్రక్షాళన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్య ని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఆరా తీశారు. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. అనంతరం మండలానికి చెందిన 143 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
మహిళా సమాఖ్య
జిల్లా అధ్యక్షురాలిగా జానకి
అనంతగిరి: మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా జానకి ఎన్నికయ్యారు. సోమవారం వికారాబాద్‌లోని మహిళా సమాఖ్య భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని పరిశీలకురాలు.. సెర్ఫ్ రాష్ట్ర ప్రతినిధి విజయలక్ష్మి తెలిపారు. సంఘం కార్యదర్శిగా శ్వేత(పరిగి), కోశాధికారి భాగ్యలక్ష్మి(మోమిన్‌పేట)ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. వీరి పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుంది. కార్యక్రమంలో డీపీఎం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


