రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి
అనంతగిరి: ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈమేరకు సోమవారం గోధుమగూడ గ్రామంలో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టారు. వీధుల గుండా ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎంతో దూరదృష్టితో రాజ్యాంగాన్ని రచించారన్నారు. కాగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ ఆగడాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు గ్రామగ్రామన రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుకారం, మల్లేశం, శివయ్య, జనార్దన్‌రెడ్డి, రమేశ్‌నాయక్, మనోహర్‌గౌడ్, రవీందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
రాజశేఖర్‌రెడ్డి


