హిందువులపై దాడులు అరికట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్ విభాగ్ సహకార్యదర్శి బూరుగు రమణ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై దాడికి నిరసనగా శనివారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్‌ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ విభాగ్ సహకార్యదర్శి బూరుగు రమణ మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడం పేరుతో బెంగాల్ మొత్తం హింసాకాండలో కాలిపోతోందని అన్నారు. బెంగాల్‌లో భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మమత ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నారు. హిందూ ఉనికికి ప్రమాదం వాటిల్లిందని, హిందువులకు భద్రత కల్పించాలన్నారు. బెంగాల్‌లో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని, హింసపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని కోరారు.


