భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం
బంట్వారం: భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి పేరిట కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. శనివారం బంట్వారం రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు తమ భూములపై జవాబుదారి తనాన్ని ప్రభుత్వం పెంచేందుకే కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఈ చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్‌ఓఆర్ మార్పులు, చేర్పులు, సాధా బైనామాలు లాంటి సేవలు సులభతరం అవుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుదేవ చంద్రా, తహసీల్దార్ విజయ్‌కుమార్, మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేషం, మాజీ ఎంపీపీ ప్రభాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సంతోష తదితరులు పాల్గొన్నారు.
మోమిన్‌పేట్: మండల కేంద్రంలో ఆల్ హెల్ఫ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగ విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సూచించారు. అలాగే ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించాలన్నారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జ్ అధికారి జయసుధ, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్


