
వన్యప్రాణుల దాహార్తికి చెక్‌డ్యాం
ధారూరు: మండుటెండల్లో ఊట నీరు వన్యప్రాణుల దాహార్తి తీరుస్తోంది. అడవిలోని జీవజాలం ఊటనీరు తాగుతూ తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. మండల పరిధిలోని ధారూరు–గట్టెపల్లి మధ్య అటవీ శాఖ చెక్‌డ్యాం నిర్మించింది. ఇక్కడ నీటి ప్రవాహం లేకున్నా వేసవిలో ఊట నీరు ఉబికి వస్తోంది. విషయం గమనించిన అటవీశాఖ 2024 డిసెంబర్‌లో రూ.5.58లక్షలు వెచ్చించి దొంగలకుంట అటవీప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించారు. ధారూరు ఫారెస్ట్ బీట్‌లో నిర్మించిన ఈ చెక్‌డ్యాంపై నిత్యం నిఘా ఉంటుంది. రాత్రిళ్లు చెక్‌డ్యాం వద్దకు వచ్చే వన్యప్రాణుల వేటకు ఎవరైనా రావచ్చునని పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. చెక్ డ్యాంలో ఎక్కువైన నీటిని కాల్వల ద్వారా పారిస్తున్నారు. మంగళవారం ఈ చెక్‌డ్యాంను ఫారెస్టు రేంజర్ రాజేందర్, డిప్యూటీ ఫారెస్టు రేంజర్ హేమ పరిశీలించారు.
వేసవిలోనూ ఉబికి వస్తోన్న ఊటజలాలు