ప్రారంభం
ఉత్సాహంగా మొదటి గ్రామసభ తొలి రోజు నుంచే భర్తల పెత్తనం మహిళా సర్పంచ్‌ల స్థానంలో అంతా తామై నడిపించినకుటుంబసభ్యులు
అట్టహాసంగా సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
పల్లె
పాలన
వికారాబాద్: రెండేళ్ల ప్రత్యేక పాలన తర్వాత గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచులు కొలువుదీరారు. ఈ నెల 17తో ఎన్నికల ప్రక్రియ ముగియగా సోమ వారం జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కూడిన నూతన పాలక మండళ్లు కొలువు దీరాయి. గ్రామ ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించారు. దైవసాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో మొదటి రోజు పాలన ప్రారంభించారు.
సత్తాచాటిన మహిళలు
జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు, 5,050 వార్డులు ఉండగా.. 75 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 594 మంది సర్పంచులు, 594 మంది ఉప సర్పంచులు, 4,464 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 594 జీపీల్లో 278 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయగా మిగతా 316 పంచాయతీలను జనరల్‌కు కేటాయించారు. సగానికిపైగా గ్రామ పంచాయతీల్లో మహిళలు విజయం సాధించారు. అంటే వారికి కేటాయించిన జీపీలు కాకుండా అదనంగా 32 స్థానాల్లో గెలుపొందారు. 310 జీపీల్లో మహిళా సర్పంచులు, 284 పంచాయతీల్లో పురుష సర్పంచులు బాధ్యతలు స్వీకిరంచారు.
ఆర్భాటంగా మొదటి గ్రామ సభలు
ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొత్త పాలక మండళ్ల ఆధ్వర్యంలో మొదటి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు చేపట్టాల్సిన పనులు, అభివృద్ధి పనులు, సమస్యలు వివరించారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్‌లు వివరించాయి. ఇదే సమయంలో ఆయా పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న నిధులు, అప్పుల గురించి చర్చించారు. పన్నులు, ఇతర వివరాలను గ్రామ కార్యదర్శులు చదివి వినిపించారు. అనేక మండలాల్లో పంచాయతీలకు సొంత భవనాలు లేక కిచెన్‌షెడ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, నూతన సర్పంచుల ఇళ్ల వద్ద ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. పంచాయతీలకు సొంత భవ నాలు ఏర్పాట్లు చేయాలని పలువురు కోరారు.
జిల్లా వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరించిన
సర్పంచులు 594
ఉప సర్పంచులు 594
వార్డు సభ్యులు 4,464
మహిళలకు కేటాయించిన స్థానాలు 278
గెలిచింది 310 జీపీల్లో..
32 జనరల్ కేటగిరీల్లో విజయకేతనం
ప్రారంభం


