మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి
కొడంగల్: మున్నూరు కాపులు ఐకమత్యంగా ఉండాలని, రాష్ట్ర కమిటీ సభ్యత్వం తీసుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు పెద్ది పెంటయ్య అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కొడంగల్, ఉడిమేశ్వరం, పర్సాపూర్, దుద్యాల్, అలిఖాన్‌పల్లి, పాత కొడంగల్, కొండారెడ్డిపల్లి గ్రామ కమిటీ సభ్యులతో పాటు కొడంగల్, దుద్యాల్, దౌల్తాబాద్ మండల కమిటీలు, యువజన కమిటీలు, మహిళా కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. తద్వారా రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. మున్నూరు కాపులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయంగా రాణించాలని సూచించారు. రాష్ట్ర మహాసభ ద్వారా విద్యార్థులకు కాచిగూడలో హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉపకార వేతనాలు, మెరిట్ స్కాలర్ షిప్పులు, పాఠ్యపుస్తకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేదింటిలో పెళ్లి ఉంటే పుస్తె మెట్టెలు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం కొడంగల్ సంఘం అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్ మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బోడుప్పల్ సంఘం నాయకులు ప్రకాశ్, యువ మండలి రాష్ట్ర కార్యదర్శి శంకర్, కొడంగల్ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లయ్య, కోశాధికారి నర్సిరెడ్డి, సంఘం ప్రతినిధులు రమేష్, అరిగె ఓం ప్రకాశ్, అనంత ప్రసాద్, నరేష్‌కుమార్, బిచ్చప్ప, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.


