సాగుకు సరిపడా యూరియా
అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించి న ప్రజావాణి కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చా యి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజ లు ఇచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచదాదన్నారు. ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో సాగుకు సరిపడా యూరి యా అందుబాటులో ఉందని, రైతులు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. మొబైల్ యాప్ వినియోగంపై పీఎస్‌లు, జీపీఓలు, వ్యవ సా య విస్తరణ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కారక్రమంలో అదనపు కలెక్టర్ సుధీ ర్, ట్రైనీ కలెక్టర్ హర్స్ చౌదరి, డీఆర్‌డీఓ శ్రీనివాస్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
వికారాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో గల ఈవీఎం గోదాంను కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సోమవారం పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్‌డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ అలీ పాల్గొన్నారు.


