28న క్రాస్ కంట్రీ పరుగుపందెం సెలక్షన్స్
తాండూరు టౌన్: పట్టణంలోని పాత శాలివాహన కళాశాల మైదానంలో ఈ నెల 28న బాలబాలికలకు క్రాస్‌కంట్రీ పరుగుపందెం పోటీలు, సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం రాములు, రాము, మధు సోమవారం సంయుక్త ప్రకటనలోతెలిపారు. అండర్ –16 బాల,బాలికలకు వేర్వేరుగా 2 కిలోమీటర్లు, అండర్ –18 బాలికలకు 4 కిలోమీటర్లు, బాలురకు 6 కిలోమీటర్లు, అండర్ –20 జూనియర్ మహిళలకు 6 కిలోమీటర్లు, జూనియర్ పురుషులకు 8 కిలో మీటర్లు, 20 ఏళ్లు పైబడిన పురుషులకు 10 కిలోమీటర్ల విభాగంలో క్రాస్‌కంట్రీ పరుగుపందెం పోటీలు ఉంటాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వచ్చే నెల 4వ తేదీన గచ్చిబౌలిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. సెలక్షన్స్‌కు వచ్చే క్రీడాకారులు తహసీల్దార్‌చే ధ్రువీకరించిన ఒరిజినల్ జనన పత్రాన్ని తప్పకుండా తీసుకురావాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 9951343432, 6300075229 లలో సంప్రదించాలన్నారు.
ఎన్నికల పారితోషికం
చెల్లించాలి
అనంతగిరి: పంచాయతీ ఎన్నికల్లో విధులు ని ర్వహించిన ఏఆర్‌ఓ,ఏఆర్‌ఓ–2, స్టేజ్–2 రిట ర్నింగ్ ఆఫీసర్లకు పారితోషికం చెల్లించాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ప్ర ధాన కార్యదర్శి ఎం పాండు కోరారు. ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ రూ.4,500, రూ.4 వేలు, రూ.3,500 చొప్పు న చెల్లించాలన్నారు.ఈ మేరకు సోమవారం జిల్లా పంచాయతీ అధికారి జయసుధకువినతిప త్రం అందజేశారు. అలాగే మే –2005 వేసవిలో 5 రోజుల వృంత్యంతర శిక్షణలో పాల్గొన్న ఎస్‌జీటీ, ఎస్‌ఏ, జీహెచ్‌ఎంలకు ఈఎల్స్ ఇవ్వాలని డీఈఓ రేణుకాదేవికి వినతిపత్రం అందజేశారు.
వాహనాల
పార్కింగ్‌కు వేలం
అనంతగిరి: వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం వద్ద వాహనాల పార్కింగ్ డబ్బు వసూలు హక్కుకై బుధవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నరేందర్, ధర్మకర్త పద్మనాభం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 2026 నుంచి డిసెంబర్ 31 2026 వరకు(ఏడాదిపాటు) వేలం వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2 లక్షల నగదు రూపంలో డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు ఆలయ ఆవరణలో వేలం ఉంటుందన్నారు.
ఉచితంగా నట్టల
నివారణ మందు
అనంతగిరి: గొర్రెలు, మేకల్లో నట్టల నివారణకు ఉచితంగా మందు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి సదానందం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2 లక్షల గొర్రెలు, 3 లక్షల మేకలు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు వందశాతం సబ్సిడీపై నట్టల నివారణ మందుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పశు వైద్య శాఖ సిబ్బంది 50 బృందాలుగా ఏర్పడి జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తూ జీవాలకు మందు తాగిస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఓవరాల్ చాంపియన్స్‌గా గురుకుల విద్యార్థులు
అనంతగిరి: నగరంలోని శామీర్‌పేటలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగిన ఉమ్మడి జిల్లా క్రీడా పోటీల్లో వికారాబాద్‌కు చెందిన మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్‌గా నిలిచారు. సోమవా రం కళాశాల ప్రిన్సిపాల్ మహబూబా ఫాతిమా విద్యార్థులను, పీడీ స్వాతిను అభినందించారు.
28న క్రాస్ కంట్రీ పరుగుపందెం సెలక్షన్స్


