స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలి | Sakshi
Sakshi News home page

స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలి

Published Thu, Apr 18 2024 10:35 AM

స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు  - Sakshi

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

మర్పల్లి: ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగంలో రాణించి ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గూడెం కృష్ణయాదవ్‌ గృహప్రవేశం కార్యక్రమం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లడుతూ.. ప్రతిఒక్కరూ ఒక స్థితికి చేరుకున్న తర్వాత సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శ్రీనివాస్‌ యాదవ్‌ పేదరికం నుంచి స్వశక్తితో ఎదిగి నేడు సొంత ఇల్లునిర్మించుకోవడం అభినందనీయం అన్నారు. సహకార సంఘం చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు ఫసీయుద్దీన్‌, కాంగ్రెస్‌ నాయకులు రాములు యాదవ్‌, రాచన్న, బలవంత్‌రెడ్డి, వెంకట్‌ తదితరులున్నారు.

శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్రమంత్రి

సతీసమేతంగా హాజరైన కిషన్‌రెడ్డి

స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ

కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్‌ రామాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్‌, కన్వీనర్‌ ఎల్మటి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, నాయకులు అమరేందర్‌రెడ్డి, నిరంజన్‌, భిక్షపతి, పాండు, రమేష్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా విజయ్‌కుమార్‌

ఇబ్రహీంపట్నం రూరల్‌: బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా మైలారం విజయకుమార్‌ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి రూరల్‌ జిల్లా అధ్యక్షుడు యాదీష్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విజయ్‌కుమార్‌ బీజేపీలో చురుకై నపాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం కార్యదర్శిగా నియమించింది.

ఆ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం

రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు మెంబర్‌ సత్యనారాయణరెడ్డి

చేవెళ్ల: ప్రజలకు ఇబ్బంది కలిగించే కాలుష్యకారకాలపై తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు మెంబర్‌ చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు సెక్రటరీ బుద్ధ ప్రసాద్‌ ఐఏఎస్‌ అధ్యక్షతన నగరంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారని.. చేవెళ్ల ప్రాంతంలోని పలు సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాండూరులోని ఏసియన్‌ బ్రౌన్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని.. చందనవెల్లిలోని కుందన్‌ టైక్స్‌టైల్స్‌, శంషాబాద్‌ శ్రీకృష్ణ డ్రగ్స్‌తోనూ పర్యావరణం కాలుష్యమవుతోందని చెప్పానన్నారు. మోకిలలో నిర్మిస్తున్న విల్లాలు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణ వ్యర్థాలు గండిపేట చెరువులోకి వదులుతున్నారని ప్రస్తావించానన్నారు. మోకిలలోని నిర్మాణాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటిసారి సమావేశానికి హాజరైన నూతన మెంబర్లను బోర్డు ఆధ్వర్యంలో సన్మానించినట్లు వివరించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కృష్ణయాదవ్‌ కుటుంబ సభ్యులతోప్రసాద్‌కుమార్‌
1/2

కృష్ణయాదవ్‌ కుటుంబ సభ్యులతోప్రసాద్‌కుమార్‌

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement