ఆమనగల్లులో ఆధిక్యత చాటుకున్న బీజేపీ | - | Sakshi
Sakshi News home page

ఆమనగల్లులో ఆధిక్యత చాటుకున్న బీజేపీ

Dec 5 2023 5:28 AM | Updated on Dec 5 2023 5:28 AM

ఆమనగల్లు: అసెంబ్లీ ఎన్నికల్లో ఆమనగల్లు మండలంలో బీజేపీ ఆధిక్యత చాటుకుంది. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోమొత్తం ఏడు మండలాలు ఉండగా ఆరు మండలాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యతను ప్రదర్శించగా ఒక్క మండలంలో బీజేపీ మెజారిటీ కనబరిచింది. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆచారి సొంత మండలమైన ఆమనగల్లులో ఆయన ఆధిక్యత కనబర్చారు. గతంలో కూడా ఆమనగల్లు మండలంలో బీజేపీకే మెజార్టీ ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఆచారికి 14,257 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి 5,602 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు 4,528 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 8,655 ఓట్లమెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో 6 వేలకు పైగా మెజార్టీ రాగా ఈ ఎన్నికల్లో మరింత పెరగడం విశేషం. ఆమనగల్లు మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆచారికి అధికంగా ఓట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement