TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం | Tirumala TTD Latest News Updates On June 21 2024 | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

Published Fri, Jun 21 2024 10:11 AM | Last Updated on Fri, Jun 21 2024 10:11 AM

Tirumala TTD Latest News Updates On June 21 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 62,756 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా లెక్క తేలింది.

తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం. నేటితో జ్యేష్ఠాభిషేకం ముగింపు. నేడు ఉత్సవమూర్తులకు బంగారం కవచాలు అలంకరణ చెయ్యనున్న అర్చకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement