Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం | Tirumala TTD Latest News Updates On June 14 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం

Jun 14 2024 9:05 AM | Updated on Jun 14 2024 9:05 AM

Tirumala TTD Latest News Updates On June 14 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 61,499 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.04 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement