విశాఖ: అండమాన్ సముద్రంలో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పారు. వాయుగుండం ఏర్పడ్డాక దక్షిణ కోస్తాంద్ర-ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. తీరానికి దగ్గరగా వాయుగుండం బలపడే అవకాశం ఉందని తెలిపారు. మరోసారి దక్షిణ కోస్తాపై ప్రభావం ఉండనుంది.


