అధికార పక్షానికి ఆర్వో సరెండర్‌ | - | Sakshi
Sakshi News home page

అధికార పక్షానికి ఆర్వో సరెండర్‌

Oct 25 2026 1:23 AM | Updated on Oct 25 2026 1:23 AM

● రామచంద్రాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ ● తొమ్మిది సెగ్మెంట్లలో నాలుగు ఆమోదం.. ఐదు రిజెక్ట్‌! ● సీసీటీవీ కెమెరాలను పైకి తిప్పేసిన అధికారులు

రామచంద్రాపురం: మండలంలో నామినేషన్ల పరిశీలన ఘట్టం తీవ్ర విమర్శలకు, ఎన్నికల అధికారుల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ అధికార పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని వైఎస్సార్‌సీపీ నాయకులు, అభ్యర్థులు ధ్వజమెత్తారు. శనివారం నామినేషన్ల పరిశీలనలో తొమ్మిది సెగ్మెంట్లకుగాను వైఎస్సార్‌సీపీకి సంబంధించి నాలుగు నామినేషన్లను మాత్రమే ఆమోదించింది. వాటిలో అనుపల్లి, సికె పల్లి, నడవలూరు, దేసూరికండ్రిగ మినహాయించి మిగిలిన నామినేషన్లన్నింటినీ తిరస్కరించారు. అధికార పార్టీ నాయకులునామినేషన్‌ కేంద్రంలోనే తిష్టవేసి, ఆర్వోపై ఒత్తిడి తెచ్చి తొలగించారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆరోపించారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులకు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అధికారులే అధికార పక్షంతో చేతులు కలిపి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డుపై బైఠాయింపు

నామినేషన్లు తిరస్కరించిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎన్నికల కేంద్రంలో జరిగిన అక్రమాలు, అధికార పార్టీ నాయకుల ప్రమేయం, అధికారుల ఒత్తిళ్లు అంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని పైకి తిప్పేశారని ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఆర్‌ఓ ఎన్నికల అధికారి చెక్‌ లిస్ట్‌లు లేవనే సాకుతో, నామినేషన్లను సక్రమంగా పరిశీలించకుండానే తిరస్కరించడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement