స్థానిక ఎన్నికల నుంచే బాబుకు చరమగీతం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల నుంచే బాబుకు చరమగీతం

Oct 25 2026 1:23 AM | Updated on Oct 25 2026 1:23 AM

● రెండున్నరేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు ● పేట్రేగుతున్న టీడీపీ గూండాలు ● స్థానిక ఎన్నికలు సజావుగా జరిపించాల్సిన బాధ్యత పోలీసులదే ● జగనన్న సంక్షేమ పథకాలే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయి ● వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి వెల్లడి

తిరుపతి మంగళం : స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలంతా చరమగీతం పాడనున్నారని కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వాసుయాదవ్‌, చెన్నారెడ్డికాలనీ కార్పొరేటర్‌ అభ్యర్థి పుణీతతో కలిసి శనివారం భూమన కరుణాకరరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లల్లో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో 143 హామీలు గుప్పించి అధికారంలోకి రాగానే ఏ ఒక్క హామీని నెరవేర్చినపాపానపోలేదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు తప్ప ప్రజాసంక్షేమం కోసం ఏ ఒక్కటైనా చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌లు రౌడీలను పెంచిపోషిస్తూ రాష్ట్రాన్ని గూండారాజ్యంగా తయారు చేశారని దుమ్మెత్తి పోశారు. టీడీపీ గూండాలు పెట్రేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా రాష్ట్రంలో టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకలు, దాడులను చూస్తుంటే రాష్ట్రాన్ని రావణకాష్టంలా తగలబెడుతున్నారని మండిపడ్డారు. లోకేష్‌ రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారనడానికి స్థానిక ఎన్నికల్లో వారు చేస్తున్న అరాచకాలే నిదర్శనమన్నారు. పోలీస్‌ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తూ టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను చింపేసి కొడుతున్నా చోద్యం చూస్తున్నారన్నారు.సుప్రీం కోర్టు ఉత్తర్వులతో కూటమి ప్రభుత్వంతో పాటు పోలీస్‌, ఎన్నికల అధికారులకు సైతం భయం పుట్టిందన్నారు. ఇప్పటికై నా ఎన్నికలు సజావుగా జరిపించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. ఎన్నికలలో ఎలాంటి అవకతవకలు జరిగినా మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement