శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను అడ్డుకుంటూ చోటుచేసుకున్న దాడులపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి,ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బలం చూపి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎవరినీ మర్చిపోమని, అందరూ గుర్తుంటారని, మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకే త్వరలో అర్థమవుతుందన్నారు. అధికారులు ఇప్పటికై నా పక్షపాతం వీడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.


