అమరవీరులకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

అమరవీరులకు ఘన నివాళి

Oct 22 2026 3:56 AM | Updated on Oct 22 2026 3:56 AM

తిరుపతి క్రైం: ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఘనంగా నివాళులర్పించింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం తిరుపతి జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించారు. పోలీసుల గౌరవ వందనం, స్మృతి పరేడ్‌ అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. విధి నిర్వహణలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసు అమరవీరుల వివరాలను అదనపు ఎస్పీ (పరిపాలన) ఏ.శ్రీనివాసులు చదివి వినిపించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.జయకృష్ణ, అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, ఐ.రామకృష్ణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement