తిరుపతి తుడా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం అధికార కూటమి నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారు. అందుబాటులో లేని అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి కుటుంబాలను భయపెడుతున్నారు. వ్యాపార కేంద్రాల వద్దకు వెళ్లి కూల్చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
అండగా భూమన కుటుంబం
కార్పొరేటర్లుగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు, వారి కుటుంబాలకు భూమన కుటుంబం అండగా నిలిచింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి పోటీ లో నిలిచిన అభ్యర్థులకు అన్ని రకాలుగా అండగా నిలిచారు. బెదిరింపులు ఎక్కువ అవడంతో వారిని జాగ్రత్త గా కాపాడుకునేందుకు ఎత్తులు వేశారు. అభ్యర్థి కు టుంబాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.


