రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Oct 22 2026 3:56 AM | Updated on Oct 22 2026 3:56 AM

– భర్త, కుమారుడికు గాయాలు

దొరవారిసత్రం: బైక్‌ అదుపుతప్పిన పడింది. బైక్‌పై ప్రయాణించే అద్దూరు సబ్బమ్మ(50) రోడ్డుపై ప్రడిపోవడంతో అటుగా వచ్చే ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఆమె తలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందిన ఘటన నెలబల్లి గ్రామ సమీపంలోని వాసమ్మ ఆశ్రమం దగ్గర జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల, స్థానికుల కథనం.. నాయుడుపేట మండలం, కాపులూరు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, భర్త సుబ్రమణ్యం, భర్త తమ్ముడు కుమారుడు మహేష్‌ను వెంట బెట్టుకు మంగళవారం దసరా పండుగ సందర్భంగా దొరవారిసత్రం మండలం, వాసమ్మ ఆశ్రమంలోని శ్రీరాజరాజేశ్వరి దర్శించుకుని పూజలు చేసే నమిత్తం బైక్‌పై బయలుదేరారు. ఆలయ సమీపానికి వచ్చే దగ్గర బైక్‌ టైరు జారిపోయి పడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక భాగంలో కూర్చొని ఉన్న సుబ్బమ్మ రోడ్డు మీదపడడంతో అదే సమయంలో విజయవాడ నుంచి చైన్నై వైపు వెళ్లే ఓ ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు వేగంగా సుబ్బమ్మ తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చెందగా భర్త, కుమారుడు గాయాపడ్డారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్‌ బస్సు పరారు కాగా స్థానికులు గుర్తించి నంబర్‌ తెలియజేయాడంతో పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ జీవీ చౌదరి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement