వెంకటగిరి(సైదాపురం): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు చేయకుండా అడ్డుకునే కుట్రలు చేయడం ఏమిటని ఆయన మండిపడ్డారు. వెంకటగిరి పట్టణ నడిబొడ్డులో రూరల్‌కు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేతలు, నాలుగు సెగ్మెంట్‌లలో నామినేషన్‌లు దాఖలు చేసేందుకు వెళ్లిన వారి నామినేషన్‌లు చించివేసి వారిపై దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. ఎన్నికల పక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.


