నేడు నైపుణ్య శిక్షణ తరగతులు | - | Sakshi
Sakshi News home page

నేడు నైపుణ్య శిక్షణ తరగతులు

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పాడి పరిశ్రమ, పాడి వ్యర్థాల ఆధారిత ఉత్పత్తుల స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికత అనే అంశంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఐసీఎఆర్‌–ఎన్‌ఏఏఆర్‌ఎం ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

కలెక్టరేట్‌లో

నేడు పీజీఆర్‌ఎస్‌

తిరుపతి అర్బన్‌: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈబస్‌ డిపో పరిశీలన

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: తిరుపతి మంగళం ఆర్టీసీ డిపోను ఆదివారం జోన్‌–4 ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఆర్‌.కె.కిషోర్‌ సందర్శించారు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్‌, డిప్యూటీ సీఎంఈ బాలాజీ, డిప్యూటీ చీఫ్‌ డిపో మేనేజర్‌ బి.నిర్మల, ఏఈ (సివిల్‌) ప్రతాప్‌, ఏఈ (ఎలక్ట్రికల్‌) హరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement