సచివాలయ ఉద్యోగులపై ఎందుకంత కక్ష | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులపై ఎందుకంత కక్ష

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

తిరుపతి రూరల్‌ : ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడంలో కీలకంగా పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు సర్కారుకు ఎందుకంత కక్ష అని వైఎస్సార్‌ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పడితే పోలీసులను అడ్డుపెట్టుకుని నడిరోడ్డుపై వారికి నరకం చూపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించి, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడం మొదలుకుని అన్ని రకాల పౌర సేవల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వారిపై ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించడం దారుణమని వెల్లడించారు. వారు కోరుతున్న రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్ల మంజూరు, ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ అమలు, ప్రొబేషన్‌ ఆలస్యమైన తొమ్మిది నెలల కాలానికి అరియర్స్‌ చెల్లింపు తదితర న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రొబేషన్‌ ఆలస్యమైన కాలానికి వార్షిక ఇంక్రిమెంట్‌ ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు ఆర్థికంగా, సర్వీస్‌ పరంగా నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీవో నంబర్‌ 11పై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని, విధి నిర్వహణలో మరణించిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement