వెంకటగిరి రూరల్: వెంకటగిరి పోలేరమ్మతల్లి జాతర ఈ నెల 30, అక్టోబర్ 01వ తేదీ జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన పలు శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు ఆల య ఈఓ వెంకట శ్రీనివాసులురెడ్డి, పాలకవర్గం అఽధ్యక్షుడు మురళి తెలిపారు. సోమవారం శ్రీకాళహస్తి ఆర్డీవో అధ్యక్షతన నిర్వహించిన సమావేశం పలు విమర్శలకు తావిచ్చంది. ‘సొంత కార్యక్రమంలా జాతర సమీక్ష సమావేశం’ శిర్షీకతో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ పట్టణంలోని పింజల వీరయ్య కల్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.


