తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని మేక్ మై బేబీ జీనియస్ పాఠశాలకు జాతీయ స్థాయి ప్రతిష్టాతమ్మకమైన ఎక్స్‌లెన్స్ ఇన్ అకడమిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డు లభించింది. విద్యారంగంలో వినూత్న బోధనా విధానాలు, ఆధునిక విద్యాప్రమాణాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు లభించినట్టు ఆ పాఠశాల చైర్మన్ సంగరాజు భాస్కరరాజు, డైరెక్టర్ సంగరాజు అశ్వినీ తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం, నైనిటాల్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్‌ఐఎస్‌ఏ జాతీయ సమ్మిట్–2.0లో ఈ అవార్డును మేజర్ జనరల్ వీఎన్.చతుర్వేది, ఎన్‌ఐఎస్‌ఏ అధ్యక్షుడు డాక్టర్ కులభూషణ్‌శర్మ చేతుల మీదుగా అందుకున్నట్లు వారు పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో ‘ఎడిఫై’కి ప్రతిష్టాత్మక గుర్తింపు
తిరుపతి గాంధీ రోడ్డు: తిరుపతి విద్యారంగంలో ఎడిఫై పాఠశాల మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు సాధించింది. దేశ వ్యాప్తంగా పాఠశాలల విద్యా ప్రమాణాలను అంచనా వేసి అందించే ప్రతిష్టాత్మక సీ–ఫోర్ పాఠశాలల అత్యుత్తమత పురస్కారాలు–2026లో భారతీయ పాఠ్య ప్రణాళికను అనుసరిస్తున్న ఉత్తమ సహవిద్యా పాఠశాలల విభాగంలో ఎడిఫై పాఠశాల జాతీయ స్థాయిలో 10వ స్థానాన్ని, తిరుపతి నగర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఎడిఫై పాఠశాల అధినేత ప్రణీత్ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. జాతీయ స్థాయిలో ఎడిఫై పాఠశాల గుర్తింపు పొందడం తిరుపతి విద్యారంగానికి గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు.


