సొంత కార్యక్రమంలా జాతర సమీక్ష సమావేశం | - | Sakshi
Sakshi News home page

సొంత కార్యక్రమంలా జాతర సమీక్ష సమావేశం

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : వెంకటగిరి పోలేరమ జాతర ఏర్పాట్లపై సోమవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో చేపట్టిన సమీక్ష సమావేశం అధికారుల సొంత కార్యక్రమంలా జరిగింది. కింద స్థాయి అధికారులు, విలేకరులు సమావేశం నుంచి వెళ్లిపోవాలని ఆర్డీవో హుకుం జారీచేశారు. దీంతో అక్కడున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు విస్తుపోయారు. అమ్మవారి జాతర రాష్ట్ర పండుగ అయినప్పిటి నుంచి ప్రత్యేక బాధ్యతలు వహిస్తూ జాతరకు సంబధించిన అన్నీ అంశాలు విలేకరులతో పంచుకునేవారు. అయితే ఈ ఏడాది దానికి భిన్నంగా మున్సిపల్‌ కార్యాలయంలోని ఓ చిన్న గదిలో సమావేశం నిర్వహించారు. దానికి తోడు దేవదాయశాఖ పర్యవేక్షణలో జరిగే ఈ జాతరలో ఆ శాఖ అధికారి, కమిటీ అధ్యక్షులు సమావేశానికి అన్ని శాఖల అధికారులు, పాత్రికేయులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ డివిజన్‌ అధికారి ఆదేశంతో పలుశాఖల అధికారులు వెళ్లిపోగా పాత్రికేయులు గంటల తరబడి వెలుపలే నిరీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement